పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/325

ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; చతుర్థాశ్వాసము

259


కానవచ్చినసొమ్ము గైకొనలేరె!
కాన నెక్కడివారు ఘనశస్త్రధనము
భరమున నీబావిఁబడినకందుకము
వెరవునఁ గొనలేక వెడఁగులై యునికి
పౌరుషంబగునయ్య పార్థివావలికి!
నేరరే దీనికి నిజ మొక్కవెరవు?”
అనిన, నాతనిఁ జూచి యంద ఱిట్లనిరి:
చనునె! నీ కిట్లాడ జగతీసురేంద్ర!
పాతాళవివరంబుఁ బలె నున్ననూయి
భేతాళుఁడైనను భీతిల్లుఁ జొరఁగ.
చొచ్చిన వెడలెడుచొ ప్పెందులేదు;
పుచ్చనేరము; మాకుఁ బుచ్చియీ మీకుఁ
జొప్పడనైనను; జూత మావెరవు!
ఒప్ప నెంతయు దీని నొగిఁ దీసియిమ్ము
నీవిద్య”. ననుటయు, నృవకుమారకుల
భావించి ద్రోణుఁ డుద్భటవృత్తిఁ బలికె :
గురుఁడ విద్యలకెల్లఁ; గోదండగురుడఁ;
బరికింపుఁడీ నన్ను బటుబుద్ధు లగుచుఁ ;
సాయుడందఱు”. నని బాణంబు వింట
ధీయుక్తి సంధించి, దృష్టి సంధించి,
చెండు నాటఁగనేసి, చెలఁగి వేఱొక్క
కాండ మక్కాండపుంఖమున నాటించి,
యాతూపునకు నొక్కయస్త్రంబుఁ జొనిపి,
యాతూపు వేఱొక్కయలుగున నాటి,
యాయమ్ముపింజయు నట గాఁడ నొక్క
సాయకంబున నేసి [1]సరవి దీపింప,

  1. సరస (మూ )