పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/319

ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; ద్వితీయాశ్వాసము

253


అమరారి తొల్లి ప్రహ్లాదునిఁ జంప
నమరి యత్నము చేసి యలసిన ట్లలసి,
యట బాలశశిఫాల నడబాల బాలఁ
గుటిలకుంతలఁ బిల్చి [1]కొంక కిట్లనియె:
"పడఁతిరో! శిలమాఱుఁ బవనకుమారు
నడపవే! యొక్కమా ఱ[2]తిశోకమాఱు;
వడ్డించునావేళ వానియన్నమున
జిడ్డుగా నొకకొంత చిలుకవే విషము.
నీవు [3]పెట్టినకూడు నిజమని కుడుచు;
నేవెంట నాకును హితమతి వీవు.
అతనిఁ జంపినఁ జత్తు రఖిలపాండవులు;
క్షితియెల్ల నాకు నిచ్చినదాన [4]వౌదు."
అనుటయు నొడఁబడు నాయడబాల
యునికిని మునుపె యుయుత్సుం డెఱింగి,
వారివాఁ డయ్యును వాయుజుతోడ
నారీతి యెఱిఁగింప, నతఁ డాత్మగొనక
యడబాల యిడిన విషాన్నంబు గుడిచి,
యడరి రుద్రునిరీతి నఱిగించుకొనియె.
ఈరీతి భీముని నెల్లమార్గముల
వారక గరళంబు వరుసఁ బెట్టించి,
నిద్రింపఁ బాముల నెఱిఁ గఱపించి,
క్షుద్రుఁడై గంగలో సుడివడఁద్రోసి,
యేయుపాయంబుల నేచి వాయుజునిఁ
బాయక చంపునుపాయంబు లేక,
తఱివేచి యాసుయోధనుఁడు పాండవుల

నెఱిమీఱఁ జెఱుపఁ జింతింపుచునుండె.
  1. కొరత
  2. రశోక
  3. చెప్పిన
  4. వీవు (మూ)