పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/318

ఈ పుట ఆమోదించబడ్డది

252

ద్విపద భారతము


వెడలివచ్చిన, వాని వేగ నీక్షించి
గడులజ్జఁ బాల్పడి కౌరవేశ్వరుఁడు :
'జలధిముంచిననైన సర్వేశ్వరుండు
గలుగునాయుష్యంబుగలవాని' కనుచు
బలిమి వెండియు నొకపాములవానిఁ
బిలిపించి, పూజించి, ప్రియములు సెప్పి:
'బ్రహ్మమంత్రములైన బలిమిఁ గైకొనని
జిహ్మగముల నీవు చిక్కించితెచ్చి,
కఱపించి చంపుము ఘనుభీమసేను;
వెఱపించు నాతండు వేమాఱు మమ్ము.
పవమానుఁ గ్రోలెడు పామునోళ్లకును
బవమానసుతుఁ డెంత పట్టిచూడఁగను!”
అనుటయు, నొడంబడి యహితుండికుండు
ననిలజు నిద్రించునావేళఁ గదిసి,
యందియు నందని యాహారనియతిఁ
గుంది భీకరవిషాగ్నులఁ బొరయుచును,
గతకాల మెవ్వరిఁ గఱచుటలేక
పుతపుతవోయెడు బోసినో ళ్లమర,
మెఱయుచు రోఁౙు పాములచేత నతనిఁ
గఱపింపఁగాఁ, [1] బళ్లుగాఁడక యవియుఁ
దెఱగొప్పఁ జీనులు తేనియ [2]గుడిచి
గఱవనోపక [3]పాఱుగతిఁ బాఱఁదొడఁగె.
అంత మెల్లనఁజూచి యావజ్రతనుఁడు
పంతపుఁబాములఁ బట్టి చెండాడి,
యుర్విఁ బాములవాని నుదికిన ట్లుదికి,
నిర్వికారతనుండె. నెఱి మఱునాఁడు
 

  1. కాళ్ళుగాండక
  2. కుడువ
  3. జారు (మూ )