పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/314

ఈ పుట ఆమోదించబడ్డది

248

ద్విపద భారతము


గతకాలమే మేలు కమలదళాక్షి!
గతమె [1]సౌఖ్యము వచ్చుకాలంబుకంటె.
కురుకులేశ్వరుపెద్దకొడుకు దుర్మార్గ
పరుఁడు, క్రూరుఁడు, మహాపాపమానసుఁడు;
వానితమ్ములు నట్టివారలు; గానఁ
బూని యాకురుకులంబునకుఁ జేటొదవు;
కర ముగ్రముగఁ బ్రజాక్షయమును గలుగుఁ ;
బొరిఁబొరి నేదలపోసిచూచితిని,
అనయంబు మఱి దాని నాంబికేయుండు
ననుభవించెడుఁ ; గాని, యట్టి[2]కార్యములఁ
జూడక యిఁక వీరిచోటు చాలించి,
కోడండ్రఁ దోడ్కొని, గురుబుద్ధితోడ
సుడియక విదురభీష్ముల కెఱింగించి,
యడవులఁ దపముసేయఁగ నేఁగుమమ్మ!
తపమునఁగాని, యెంతయును వేఱొండు
ఉపమల గతియుండ దూహింప.” ననుచు
నల్లన బోధించి, యంత వ్యాసుండు
తల్లిని మఱదండ్రఁ దపమున కనుప,
నరయ నమ్మునియాజ్ఞ నతివలు భక్తి
వెరవొప్పఁగాఁ దపోవేషంబు దాల్చి,
దారుణాటవినుండి తమతపోమహిమ
వారు ప్రాపించిరి వైకుంఠపదము.
ధృతరాష్ట్రుఁడిట నెల్ల దిక్కులనృపుల
కతిశయప్రాభవాయతఁ బెచ్చు పెరిగి,
'తనయులు, నాపాండుధరణీశసుతులు,
ననియెడు భావంబు లాత్మలో లేక

  1. సామై
  2. కారణము (మూ)