పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/313

ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; చతుర్థాశ్వాసము

247


స్నానతర్పణములు శ్రాద్ధాదికములు
బూని నిర్వర్తించి పురమున కరిగి,
కొంత [1]దుఃఖంబాఱి కొత్తగా [2] నిండ్లు
కుంతికిఁ దత్పుత్త్రకులకుఁ [3]గట్టించి,
జలనిధివేష్టితసకలభూతలము
నలమి యేలుచునుండె'. నదియును గాక,
'వరున ధర్మజ భీమ వాసవి యమల
పరిచిత[4]కీర్తనప్రకరంబు వినిన,
ధర్మాభివృద్ధియు ధరఁ బాప[5]హతియు,
దుర్మదారిజయంబుఁ దోడ్తోనఁ గలిగి
రోగంబులెల్ల నారోగ్యమౌ' ననుచు
బాగుగా వేదంబు పలికెడుఁగాన,
సొరిదిఁ బుణ్యశ్లోకసుఖుల పాండవుల
చరితంబు లెంతేని సరి చెప్పవచ్చు;
నైనఁ గానిమ్ము, నాయాత్మలోపలను
నే నెఱిఁగినపాటి యెఱిఁగింతు వినుము;
అంతట నొక్కనాఁ డనఘుండు వ్యాసుఁ
డంతరంగంబున నానంద మొదవ
నరుదెంచి, వినతుఁడై యాసత్యవతికి
గర మర్థిఁ బలికె నేకాంతంబునందు :
"అతివ, యీసంసార మతిచంచలంబు;
మతిఁ దలంపఁగ నెండమావులయట్లు
జలతరంగములట్లు సంపదలెల్ల;
నలిఁ దలంపంగఁ బ్రాణము లస్థిరములు;
కాయంబు విద్యున్నికాయంబు తెఱఁగు ;
ప్రాయంబు లటు కతిపయదివసములు;

  1. దుఃఖించిరి
  2. నుండు
  3. గట్టింటి
  4. కీర్తిత
  5. హరము (మూ )