పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/308

ఈ పుట ఆమోదించబడ్డది

242

ద్విపద భారతము


సుతులఁ గాంచితి గాని, సుతు లుర్వి యేలఁ
గుతలంబు మెచ్చఁ గన్గొనఁ గానవైతి!
ఈయాత్మజుల నిప్పు డెవ్వరి కిచ్చి
పోయితివో! పాండుభూపాలతిలక!
ఇంక నెవ్వరు మాకు నిచ్చోటదిక్కు
ఇంకఁ బాలైతిఁగా యీశోకవహ్ని!
పరికింపజాల నీబాలుర విడిచి
యరుదెంతు నీవెంట." ననునంత, మాద్రి :
"ఇమ్మెయి మృగశాప మెఱిఁగియు నెఱిఁగి,
వమ్మైన నాబుద్ధి వరదఁబోవిడిచి,
యొడలు [1]మఱచినయట్టి యొప్పనిదానఁ;
గొడుకులఁ బెంపంగఁ గుంతి, యే నేర.
వసుధేశ్వరునకు నావలననగాదె!
యసువులు దొలఁగంగ నక్కటా! వలసె.
నా కెడ యిమ్మింక నలినాయతాక్షి
యీకురునాథుతో నేఁగెద నిపుడు ;
తనయుల రక్షింపు తరుణి, నీ వుండి;
నను బంపు నరనాథునకు సహాయముగ.
నితని నేమఱినట్లె యే నిల్తునేని,
సుతుల నేమఱుదును శూన్యాటవులను,
కావున, నామాట గాదన కిపుడు
వేవేగ నను బాండువిభుఁగూడ ననుపు."
అనుచు రాజేంద్రుశయ్యకు దాటుకొనిన,
మును లంత శోకాబ్ధి మునుఁగుచు వచ్చి
యెప్పుగా నందఱు నొగిఁగూడి, కుంతిఁ
దప్పక యూరార్చి తమలోన ననిరి :

  1. మరువని యిట్టి (మూ)