పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/303

ఈ పుట ఆమోదించబడ్డది

ఆదిపర్వము ; చతుర్థాశ్వాసము

237


[1]చిగురాకు లారగించినచంచు వమరఁ,
బొగరెడులోచనంబులఁ గెంపు గదుర,
బలువడిఁ జిగురుజొంపములలోనుండి
కలయంగఁ గోకిలగము లెలుఁగించెఁ;
దెల్లఁగాఁ బూచినతిలకంబుమ్రోల
మొల్లంబుగాఁ [2]బూచి మోదుగు [3]పొదల
నాఁటియీశ్వరు[4]ఫాలనయనాగ్నిశిఖల
నాటిన మండు మన్మథుఁ దలఁపించెఁ;
బెక్కుతెఱంగులై బెరయుతావులకు
నెక్కడ మూఁగును మేది మే లనుచుఁ
జంచరీకములు బిసాటంబు దిరిగి,
నిల్చి యెందును వ్రాలనేరకయుండె;
గండుఁగోయిల జంకె గర్వంబు లుడిగి
మిండలఁగవయుకామినులకోపాగ్ని;
నడవుల వేఁట సేయను బుష్పధూళి
వడి మృగంబుల కొక్కవన్నియ దెచ్చెఁ;
గ్రమమొప్పఁ గమలాకరంబులై చాలఁ
గమలాకరము లొప్పెఁ గడురమ్య మగుచుఁ ;
దనదుబాణములను దైవంబులైన
ననుపమగతి శిరసావహింపంగఁ,
దనవిల్లు లోకముల్ దగఁ గొనియాడఁ,
దను నెల్లవారుఁ జిత్తజుఁడని పొగడఁ,
గడఁగి నిశ్చలకీర్తి గాంచిన [5]మరుఁడు
గడు వడిగల్గు చిల్కలరథం [6]బెక్కి,
యానలఁ గదలి, మీనాంకంబు మెఱయ,
వావిరిఁ గమ్మపూవాలమ్ము లేర్చి

  1. చిగురాకు లొగిమించుచెంచుక మెరసి
  2. జూచి
  3. మ్రోల
  4. యాల
  5. మధుడు
  6. బిచ్చె (మూ)