పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/294

ఈ పుట ఆమోదించబడ్డది

228

ద్విపదభారతము


ధృతరాష్ట్రునకు వంశదీపకులైన
సుతులు నూర్వురు నొక్కసుతయును బుట్టి
యున్నవా రనువార్త యుర్విపై మ్రోయ
విన్నవాఁడై, పాండువిభుఁడు మోదించి,
శూలివిక్రములైన సూనులు తనకుఁ
జాలనితలఁపున సాధ్వి కిట్లనియె:
"తరుణి, విద్యలచేతఁ దనయులచేతఁ
ధరచేత సిరిచేతఁ దనియ రెవ్వరును;
ఇక్కగా నినువంటి యిల్లాలుగలుగఁ,
బెక్కండ్రు గావలె బిడ్డలు మనకు.
శతమఖు నమరేంద్రు శతకోటిధరుని
బ్రతిలేని యాదివస్పతియైన యట్టి
యింద్రు నారాధింపు; మిఁక నొక్కసుతుని
జంద్రవంశము నిల్పఁజాలినవాని,
మానితాటోపు సమంచితోత్సా[1]హు
[2]భానుసన్నిభ[3]దీప్తప్రభ గల్గువాని
నాచంద్రధరసురేంద్రాది దేవతలఁ
జూచి పోరాడ నిష్ఠురుఁడైనవానిఁ
గనుము; కాంచినదాఁక గౌరీవ్రతంబు
ఘనతరనిష్ఠతోఁ గమలాక్షి, నడుపు"
అని చెప్పి, తా నొకయైంద్రమంత్రంబు
మునులచే నుపదేశముఖమున నెఱిఁగి,
యరుదైన నిష్ఠతో నమరాధిపతికి
ధర నేకపాదుఁడై తపము సేయంగఁ,
బ్రత్యక్షమై వచ్చి పలికె వాసవుఁడు :

  1. బాహు
  2. దీప్తు (మూ)