పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/283

ఈ పుట ఆమోదించబడ్డది

ఆదిపర్వము ; చతుర్థాశ్వాసము.

217


నలినాక్షి ప్రార్థింప నవ్వుచు నతఁడు :
'పొలఁతి, యూర కవచ్చిపోరాదు నాకు.
కన్నెఱికము వెల్తిగాకుండ సుతుని
మన్నించి యిచ్చితి మది నియ్యకొనుము. '
అనుచు, సద్యోగర్భమనువిధానమునఁ
దనయుఁ దేజోమూర్తిఁ దనయంతవాని
నిచ్చి, కర్ణుండని యిలఁ బేరువెట్టి
[1]యిచ్చ దివాకరుం డేఁగిన, నింతి :
'తనయుని నక్కటా! తండ్రికిఁ జూపఁ
గొనిపోవలేదు; మక్కువఁ బ్రోవలేదు;
ఇల నాకు నక్కటా! యిటుమూఁగగన్న
కలయయ్యె; నూరకే గడఁగితి.' ననుచు
సహజకుండలములు, సహజవర్మంబు,
మహి నెవ్వరికిలేని మదనరూపంబుఁ,
గలిగినకర్ణు నక్కడఁ బాఱవైవఁ
దలఁపుపుట్టకయున్నఁ, దరళాక్షి కడకుఁ
గ్రందుగా నవరత్నఖచితమైనట్టి
మందసమొక్కటి మార్తాండుకృపను
ఏటివెంటనె వచ్చి యిక్కువ నిలువ,
....... ........ ........ ....... ....... .......
నాదిత్యసమవర్ణు నాకర్ణు నందు
నునిచి యంగన వోవ, నొయ్యన నదియుఁ
బొనరఁ జంపారాజ్యమునఁ బోవుచుండ,

కర్ణుఁడు సూతునకు దక్కుట



నాంబికేయుని మిత్రుఁడైన సూతుండు
కంబుకంఠులుఁ దాను ఘనజలక్రీడ

  1. అచ్చ (మూ)