పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/281

ఈ పుట ఆమోదించబడ్డది

ఆదిపర్వము ; చతుర్థాశ్వాసము.

215


యమునిఁ బ్రార్థించిన, నారాత్రి వచ్చి
రమణికోరిన ధర్మ [1]రాజు నీ వలచి,
ముదమారఁగా యోగమూర్తి ధరించి,
సదయుఁడై వరమిచ్చి సమవర్తి యరిగె,
అరిగిన, నాతనియంశ[2]౦బువలనఁ
గరియాన యొకయేఁడు గర్భంబు దాల్చి,
ప్రోష్ఠపదంబునఁ బుణ్యమాసమున
జ్యేష్ఠాష్టమీరాత్రి సిద్ధయోగమునఁ
గుడికాలరేఖలై [3]గొడుగు కంబువును
బడగయు సామ్రాజ్యపద్ధతిఁ దెలుప,
భరత[4]వంశాంభోధిపంకజవైరి
నిరుపమకారుణ్యనిధి నిశ్చలుండు
ధర్మంబు రూపంబు దాల్చెనో యనఁగ
ధర్ము[5]నంశంబున ధర్మజుండనఁగఁ
బ్రభవించెఁ దనయుండు పంచగ్రహములు
శుభదృష్టిఁ గ్రుంకక చూచుచునుండ.
అప్పుడు సురలెల్ల నానందజలధిఁ
దెప్ప దేలిరి; మిగులఁ దెలిసె లోకములు;
దినపతి వెలుఁగొందె; దేవగానములు
విననయ్యె; నారదువీణ ఘోషించె ;
'పొదివినరణములో భూరివైరులకుఁ
జెదరక చంచలించక నిల్చుఁగాన (?)
నితఁడు యుధిష్ఠిరుం డీధాత్రి ' ననుచు
నతనికిఁ బేరిచ్చె నాకాశవాణి;
[6]తొడరిఁ 'యజాతశత్రుం డిత ' ౦డనుచు
నొడివిరి మునులు మనోవీథి నెఱిఁగి".

  1. రాజుని వలసి
  2. భాగమున
  3. గొడకకంభంబు
  4. వరశాన్వయ
  5. నంశంబున
  6. తొడగె (మూ)