పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/280

ఈ పుట ఆమోదించబడ్డది

214

ద్విపదభారతము


ధర్మజు జననము

"యేవేల్పుఁ దలఁచిన, నేతెంచి నాకు
నా వేల్పు నందనుండై యుదయించు.
మంత్రంబు గాంచితి మనుజేంద్ర, తొల్లి ;
తంత్రజ్ఞ, యేవేల్పుఁ దలఁపుదు?" ననిన,
వాడినసస్యంబు వాన గన్నట్లు
చేడియమాటకుఁ జెలఁగి పార్థివుఁడు :
"సుందరి, సుతుమోముఁ జూడ నేఁ గంటిఁ;
గిందవుశాపాగ్ని కిందవునింక.
[1]అందనిపండ్ల నే నందంగఁ గంటి;
విందవు నామాట వృథ సేయవైతి.
మందవు [2]మంత్రంబు మహిఁ బుణ్య[3]ఫలము
[4]మందుఁడ నాకుఁగా మగువ, నేర్చితివి.
సకలలోకముల కాస్పదమై, ధరిత్రి
సకలధర్మములకు సదనమై వెలసి,
సమవర్తనంబున సమవర్తి యనఁగ
నమరవేల్పులలోన నధికుఁడై మించి,
సకలజీవులయందు సమచిత్తుఁడైన
యకలంకుఁ దలఁపుమ యాత్మలోశముని.
పితృపతి యాతండు బిడ్డఁడై వెనుక
పితరులఋణమెల్లఁ బ్రియముతోఁ దీర్చు."
అనినఁ బ్రదక్షిణం బతనికి వచ్చి,
వనిత యాదుర్వాసుపరమంత్రమహిమ
నంతకుదెసకువై హస్తముల్ మొగిచి,
కాంత సద్భయ[5]యుక్తిఁ గడుభక్తితోడ

  1. యందనిపనులని నే చూడగంట్టి.
  2. పుణ్యంబు
  3. కథల
  4. మందవు
  5. భక్తి (మూ)