పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/268

ఈ పుట ఆమోదించబడ్డది

202

ద్విపద భారతము


సబలత వానిమాంసము చూచి డేగ
శిబిమాంస మడుగుట సిగ్గుగాఁ [1]దలఁచు;
నెఱయ నొక్కొక్కటి నెఱిచూపియున్న,
[2]నెఱి జగత్త్రయమును నీరసంబగును ;
ఓలి నొక్కొక్కటి యుగ్రతనెదురఁ,
గాలానలంబైనఁ గఱిబొగ్గువడును;
నెమ్మి నిన్నియుఁ గూడి నీటికి డిగిన,
నమ్మడుగునఁ జిక్కు నడుసును మీలు;
నవి రాజులునుబోలె నాత్మవైరమున
భువి భీతులునుబోలెఁ బూరిమేయుచును,
ధరఁ బక్షులునుబోలెఁ దగ [3]నెగురుచును,
బొరిపొరి మ్రుచ్చులుపోలెఁ ద్రవ్వుచును,
జెడనికాపులువోలెఁ జేనుప ట్టరసి,
కడుఁ [4]గొలంకులువోలెఁ గనుమలు త్రొక్కి,
[5]కూరిననెలవోలెఁ గొమ్ములు [6]పొదలి,
[7]కారుమొగిళులుపోలెఁ గంకుచు వచ్చి,
పెద్దకందయుఁబోలెఁ బిల్లలఁ బొదివి,
తద్ద ధూర్తులువోలె ధరకు వ్రేఁగగుచుఁ,
బుట్టజున్నులుపోలెఁ బుటపుట నగుచు,
నిట్టప్రౌఢలుపోలె నెందు వెల్వడక,
గడి భూమిప్రజవోలెఁ గడుబెదరుచును,
సుడి భిక్షకులువోలె శునకవైరమున,
నరఁటిమ్రాఁకులుపోలె నటపొరలెక్కి,
పొరిఁ గర్ణధారులుపోలె గాడ్పె [8]ఱిఁగి,
భువి విరహులుపోలెఁ బొదరిండ్లు దూరి
వివిధరూపులనుండు; వేయేలచెప్ప!

  1. దనుచు
  2. నెరి నెత్రయాగంబు నిరసంబులను
  3. నొరయు
  4. దొలంకులు
  5. కూడిన
  6. ఒదవి
  7. కోరమొగిలువోలె గొంకులుపట్టి.
  8. రిసి (మూ)