పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/264

ఈ పుట ఆమోదించబడ్డది

198

ద్విపద భారతము


గ్రిక్కిఱియఁగ, నాంబికేయుండు ధనము
తక్కక వేడ్కతోఁ దనచేతికొలఁది
నాలయంబులకు, దేవాలయంబులకు,
బాలాది[1]వృద్ధాంతపౌరమండలికి,
బంధువర్గములకు, బ్రాహ్మణోత్తముల,
కంధాదిదీనుల, కతిథికోట్లకును,
బేదసాదలకుఁ, బెంపారబంధులకు,
నాదట సఖులకు, నాశ్రితావళికి,
బంధురాత్మకులకుఁ, బరహిత సత్య
[2]సంధ సత్పురుష సజ్జనవరేణ్యులకు
బాగొప్ప వెచ్చించి, పదియశ్వమేధ
యాగంబులను జేసి యది తెగకున్నఁ,
దమ్మునిశక్తికిఁ దలపులో మెచ్చి
యిమ్ముల ననురాగ మెసగంగ నుండె.
పురుకుత్స సగర పురూరవులాది
కురుమహీశులఁ బోలి కొమరు దీపించి,
యాపాండుఁ డంత నేకాతపత్త్రముగ
నేపారఁగా ధాత్రి యేలుచునుండె.

పాండురాజు శాపోపహతుఁడగుట

అంతఁ, జంద్రునిలోనిహరిణంబునైన
వింతగా నలయించి వెసఁ బట్ట నేర్పు,
నింగినైనను జొప్పు నెమకంగనేర్పు,
సింగమైనను వ్రేయఁ జిక్కిననేర్పు,
లలిఁ గాలినైనఁ గాల్నడఁగూడునేర్పు,
శిలనైన నొకనందు చేకొనునేర్పు,

  1. వృద్ధాంగ
  2. సంధుల సత్పురుష జనవరేణ్యులకు (మూ)