పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/243

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆదిపర్వము ; తృతీయాశ్వాసము.

179


[1]బిరుదులువోయియు, విఱిగియు, నృపతు
లరవరులయ్యు నయ్యనువున డస్సి
[2]దీనాస్యులై పెక్కు తెరువులఁ బోవఁ,
దానట్లుపోవక తవిలి సాల్వుండు
భీష్ముని నారాచ [3]ప్రేరితుఁజేయ,
గ్రీష్మ కాలాదిత్యుక్రియ నాతఁ డలిగి,
విల్లును జోడును [4]వెడఁదైన కేడె
మల్లియఁ దునిమి, యయ్యెడ నొక్కకోల
నాటించి తేరుభగ్నముసేయ, నతఁడు
దాటి ధాత్రికిడిగ్గి తలవీడఁబాఱె.
అంత నూరికివచ్చి యాపగేయుండు
కాంతల నొక్కలగ్నమునఁ దమ్మునకు
....... ........ ......... ......... ......... ........
......... ......... ......... ........ ....... .......
శక్తిత్రయంబుతో సంధించునట్లు
భక్తిమైనున్న చోఁ బలికె నయ్యంబ :
“నరనాథ, యిటమున్న నన్ను సాల్వుండు
వరియించె ; మాతండ్రివచనంబుఁగలదు ;
నీవునుఁదెచ్చితి; నీతిమార్గమున
భావింప, నీకంటెఁబ్రాజ్ఞులు గలరె !”
....... .......... ......... ....... ....... .........
అనుటయుఁ, దనకుముప్పైన యాయింతి
ననిచి, భీష్ముం డంబికాంబాలికలను
ననుజునకిచ్చిన, నసమాస్త్రు కేళిఁ
దనియక యతఁడు నిత్యంబుఁగ్రీడించి,
నానాఁటి కొడల జీర్ణవ్యాధిపుట్టి
మానక యాలీల మరణంబునొందె.

  1. చిరువులువోయివొరిగియునృపతు.
  2. దీనాళులై.
  3. ప్రీతుని.
  4. వెడఁగైన నమరి. (మూ)