పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/239

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆదిపర్వము ; తృతీయాశ్వాసము.

175


డక్కగా నాడుబిడ్డల నిచ్చుచోటఁ
దక్కక చింతింపఁదగుఁ; గాన నతఁడు
నృపనందనునిఁబల్కు: “నీకు నీవోపి
నృపునిఁ జేసెదనంటి ; నిజము నీమాట;
నీకుఁబుట్టెడువారు నీయంశమునకు
రాకమానరు; ఘోరరణములౌ నపుడు;
కావునఁ, గూడదు కళ్యాణ". మనిన,
నా వేశమెత్తిన ట్లతఁడు భీష్మించె:
“ఏను బెండిలియాడి యెన్నఁడే నొకనిఁ
గానఁగ మఱిగదా ! గలుగుఁ గయ్యములు;
మనుజేంద్రుపెండ్లికై [1]మానెదఁబెండ్లి ;
ఘనతఁ బుత్త్రుల గానఁగలవాఁడఁ గాను.
[2]అమర మైయుండు నాయౌవనావస్థ :
రమణుల [3]నంగ యారంభదీమముగఁ
గుసుమాస్త్రుఁడేయనీ కుసుమబాణముల,
వెస వీడిపోవనీ నితరులునన్నుఁ,
బట్టితిఁ బట్టితి బ్రహ్మచర్యంబు
గట్టిగా. " ననుటయుఁ, గడు [4]మెచ్చి సురలు
'దేవవ్రతుం' డని దివినుండి పొగడ,
భూవరుపైఁ గురిసెఁ బుష్పవర్షములు.
'భీష్మించి యతఁడేఁగెఁ బితృభక్తి' ననుచు
భీష్మనామకుఁజేసి పిలిచిరి జనులు.
అంత సంతోషించి, యాదాశరాజు
'కాంతనిచ్చితి ' నని గాంగేయు వెనుక
నిభముపై గూఁతురి నెక్కించుకొనుచు
నిభపురంబున కేఁగె నెలమిదీపింప.

  1. మానెనా.
  2. అమగమై.
  3. నంగనిరంభటోయముల.
  4. వొప్పి. (మూ)