పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/231

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆది పర్వము ; తృతీయాశ్వాసము.

167


అప్పుడు నరనాథుఁ డాత్మలో 'నబల
చెప్పినయట్లెల్లఁ జేయుదు' ననుచుఁ
దలఁచుచున్నతనికిఁ దరుణి యిట్లనియె:
"నెలకొని చేసెద నీకుఁగాపురము ;
ఏ నేమిచేసిన నీవు గాదనక
యూనినమతి నూరకుండనోపుదువె!
ఉండక యెన్నఁడే నుల్లంబునొవ్వ
మండలేశ్వర, నన్ను మఱచి యాడినను,
అప్పుడు నినుడించి యరిగెదఁజువ్వె !
చెప్పితి, నట్లైనఁజేపట్టు, " మనిన
నొడఁబడి, శంతనుం డువిదకచ్చోటఁ
గడురమ్యముగ నిండ్లు గట్టించి, యందు
సురతానుభవమున సురరాజు పోలె
సురనదిఁ గూడి భాసురసౌఖ్య మందె.
అత్తఱి, వరుణేంద్రులాదిగా వసువు
లెత్తిన క్రమముతో నింతికిఁ బతికి
జనియింప జనియింప, జాహ్నవి వారి
మనుజేశ్వరుఁడుచూడ మదిఁగొంకులేక
గొనిపోయి గంగలోఁ గూయికూయనఁగ
మునిచి, తీర్థములాడి ముద మొప్పవచ్చు.
ఇట్టుముంచి వధింప [1]నెవ్వగదాఁక,
నెట్టనఁజూచి యానృపచక్రవర్తి
యాలికడ్డముచెప్పనన్నాఁడు గాన
లోలోన వగలఁగాలుచు నోర్చియోర్చి,
యనల తేజుని నంత నష్టమవుత్త్రుఁ
గొనిపోవఁ, బోనీక గోపించిపలికె

  1. నెవ్వరు. (మూ)