పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/223

ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; తృతీయాశ్వాసము.

159


దనయునకైనను దండ్రిముందటను
ఘనయౌవరాజ్యంబు గానలేదయ్యె!"
నని యిట్లు పలుకుచు నధిపుదూఱుచును,
మనమునశోకించి మఱియు నిట్లనియె:
"అనలుండు, చంద్రుండు, నంభోజసఖుఁడు,
ననిలుండు, భూమియు, నాకసం, బాత్మ,
యుదకంబు, జముఁడును, నుభయసంధ్యలును
మదిఁజూతు రెప్పుడు మనుజులనెల్ల;
గావున, నీరాజుకల్ల నిజంబు
దేవతాతతులార, దృష్టింపుఁ డీరు."
అని పలుమాఱు నయ్యతివ శోకింప,
వనితకై యాకాశవాణియిట్లనియె:
"ఓరాజ! వినుమ, యీయువతి నీభార్య;
శూరుఁ డీబాలుండు సూనుండునీకు;
గాంధర్వ[1]విధమునఁ గానలో నీవు
సంధించితివి దీని; సత్య మీమాట.
సందియం బేటికి! సతియైన దీని,
నందనుఁ గైకొమ్ము నరనాథ, మేలు".
అనిన సంతోషించి [2]రఖిలసభ్యులును;
జననాథుఁడును హర్ష[3]సంభృతుఁ డగుచు
మౌని [4]సామంతుల మంత్రులఁ బలికె :
"నేనెఱింగియు నింతి నింతసేయుటలు,
వనములో నొంటిమై వర్తించునట్టి
ఘనకృత్య మిందఱుఁ గలయంగఁ దెలియ
వలసి; యింతియె కాని, [5]వరుస నీసాధ్వి
కులకాంతయగు; వీఁడు కొడుకును నగును."

  1. మిదియును
  2. యఖిల
  3. సంభృతు లగుచు
  4. సామజకేళి
  5. వలసి (మూ)