పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/212

ఈ పుట ఆమోదించబడ్డది

148

ద్విపద భారతము


దొండపంటికి సిగ్గు దొడరంగఁ జేయు
దండికెంపులమోవిఁ దనరెడుదానిఁ,
జిలుకకోవెలలకుఁ జెలగువీణెలకుఁ
బలుకులఁ దలవంపు పాటించుదాని,
మరుఁడు జయంబంది మహిమఁబూరించు
కరశంఖగతి నొప్పు కంఠంబుదానిఁ,
గవజక్కవలఁ గవకవ నవ్వఁజాలు
సవరని చనుఁదోయి జానొప్పుదాని,
నిగురించులతలతో నెకసెక్కమాడు
జిగిబిగిగల మేని చెలువంబుదానిఁ,
గన్నియ లావణ్యగౌరవంబునను
వెన్నున విహరించు విపులంపువేణి
యుదరంబుపైఁ దోచెనోయనఁ జాలు
నొదవినరోమాళి నొప్పారుదానిఁ,
బఱపైన చనుఁదోయిభారంబువలన
సరిపేదమధ్యంబు జడియ, నానాభిఁ
బసిఁడిశలాకచే బంధించిరనఁగఁ
బస మూడువళులను భాసిల్లుదాని,
మరుని [1]జైత్రరథంబు మార్కొనఁజాలు
వరజఘనంబుల వాసైనదాని ,
ననఁటికంబంబుల నదలించుతొడల
నొనరినపిక్కల నొఱపైనదాని,
రాయంచగములతో ఱంతుగావించు
ప్రాయంపునడపులఁ బరఁగినదానిఁ
బటురీతిఁ జెలులతో భాషించుదానిఁ
గుటిలకుంతలను శకుంతల నతఁడు

  1. చైత్ర (మూ)