పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/209

ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; తృతీయాశ్వాసము.

145


లడ్డంబుగావచ్చి యతని దీవించి
దొడ్డప్రియంబులు దోప నిట్లనిరి:
"చనదు చంపగ దీనిఁ; జాలు నీయలుక;
[1]యనఘాత్మ, యిదిమదీయాశ్రమమృగము.
ధూర్తులఁ దెగటార్పఁ దొడరు నీబలిమి
యార్తుల రక్షింప నందంబుగాదె!”
అనిన, వారలమాట లంగీకరించి
మనుజేశుఁ డిట్లను: “ మహితాత్ములార,
దవ్వులనే వేడ్క దనరంగఁజేయు
నెవ్వరియాశ్రమం బీపుణ్యభూమి? "
అనవుడు మౌనీంద్రు లతని కిట్లనిరి :
"వినుమయా రాజన్య, విఖ్యాతుఁ డగుచు
దేవదానవులకు ధృతిఁదండ్రి యగుచు
భావజ్ఞ కశ్యపబ్రహ్మసంయమికిఁ
దమ్ముఁడై, ఘనతపోధర్మాత్ముడైన
యమ్మహాత్ముడు కణ్వుఁ; డతనియాశ్రమము.'
అని చెప్ప, దుష్యంతుఁ డలరిచిత్తమున :
'మునిచంద్రు సేవించి, ముదమొప్ప నిందు
ఘనతపోమహిమలు గలయ నీక్షించి,
నను బుణ్యుఁజేయుదు ననువొప్ప'ననుచు
మనమునఁదలపోసి, మంత్రుల భటుల
నునిచి యచ్చోటికి నుర్వీశుఁ డేఁగె,
దారుక మాకంద దాడిమీ నారి
కేర కేసర నాగకేసర గ్రాహి
జంబీర శింశుపా జంబూ కదంబ
నింబ ప్రియక నీల నిచుల కుద్దాల

  1. యెనయంగనిది (మూ )