పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/199

ఈ పుట ఆమోదించబడ్డది

ఆదిపర్వము; ద్వితీయాశ్వాసము

135


రూపవైభవకళారూఢి నారాజు-
రూపంబులైయున్న, రోషించిచూచి
మగనితోనిట్లను : 'మనుజేశ, వీరు
తగవొప్ప నెవ్వరితనయులో ! ' యనిన
రాజూరకుండిన, రమణి యాసుతుల
నోజతోనడిగె ని: 'ట్లోబాలులార,
మీతల్లిదండ్రుల మృదురీతి నాకుఁ
బ్రీతిఁజెప్పుఁడు మీకు బెల్లమిచ్చెదను. '
అనిన బాలురుపల్కి: 'రతివ, మాతండ్రి
తనర యయాతి ; మాతల్లి శర్మిష్ఠ.'
అనవిని భార్గవి యతిశోక కోప-
వినతయై, యచ్చోటవీడ్కొనిపోయి
తనతండ్రికంతయుఁ దప్పక చెప్పఁ,

శుక్రుఁడు యయాతిని శపించుట

గనలి, యాశుక్రుఁ డాకన్యనూరార్చి :
“నిను డాఁగురించి యానృపతి శర్మిష్ఠ
ననుభవించినయట్టి యాపాపమునకు
వదలజవ్వన, మెల్ల వాసియుఁదక్కి
ముదిమినొందు" ; నటంచు ముని శాపమిచ్చె.
నిచ్చిన, వివశుఁడై యెఱిఁగి యయాతి
యచ్చుగా శుక్రున కందందమ్రొక్కి,
యనయంబు భక్తితో నంజలిచేసి:
"యనఘాత్మ, చేసితినపరాధమేను ;
గావవే! ముదిమి నేఁగడవంగనోవ ;
భావింప విషయానుభవకాంక్ష గలదు."
అనియనిప్రార్థింప, నతఁడు చింతించి
తనలోన నొక్కింత దయచేసి పలికె: