పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/193

ఈ పుట ఆమోదించబడ్డది

ఆదిపర్వము; ద్వితీయాశ్వాసము

129


దక్కినమృగములఁ దవిలిచెండాడి,
వెక్క సంబుగ డేగ వేఁటయు నాడి,
తనసేనలును దాను ధరణినాయకుఁడు
వనములో వేడ్కమై వర్తించునంత,
విరిదమ్మివిరులపై విహరించి, యలరు
తరుణుల మనుగురుల్ తరళింపఁజేసి,
వనపుష్ప సౌరభ వాసితంబగుచు
మనుజేశుపై వీచె మందమారుతము.
తరుణుల చదురులు, దంటమాటలును,
బరిహాసములు వినఁబడెఁ; బడుటయును,
జెవులలో నమృతంబు చిలికినట్లై న
నవలీల నే తెంచె నరనాయకుండు.
చుక్కలలోనున్న శుభ్రాంశు కలికి
చక్కఁదనంబున [1]జవ్వనంబునను
జెలులలోపలనెల్లఁ జెలువమై మిగుల
లలితభావంబున లలినొప్పుదాని,
నెఱిగలకురులును నిడుదకన్నులును,
మెఱుఁగుఁజెక్కిళ్లును, మించినమోవి,
నగెనగెననియెడి నవకంపుమోము,
జిగిబిగి గలిగెడి చిన్ని చన్నులును,
దెగెఁదెగెననియెడి [2]తేలికనడుము,
ధగధగమనియెడి తను [3]వల్లరియును,
నూఁగారు [4]సౌరు, నన్నువలైనవళులు,
బాగైనపిఱుఁదును, [5]బసిమిపాదములుఁ
గలిగి కాంతలకెల్లఁగాంతియై [6]నిలిచి
యలరెడు నా దేవయాని నానృపుఁడు

  1. జవ్వనియగుచు.
  2. తెలినినెన్నడుము.
  3. వల్లకి
  4. నారు.
  5. బసని.
  6. గెలిచి. (మూ)