పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/187

ఈ పుట ఆమోదించబడ్డది

ఆదిపర్వము; ద్వితీయాశ్వాసము

123


ఒనఁగూడ వీమాట -------- . " ననినఁ
గనలి, యాభార్గవి కచునకిట్లనియె :
“ఓదురాత్మకుఁడ, నీవును బ్రాహ్మణుఁడవె !
నీదురుక్తులు నమ్మి నేవెఱ్ఱినైతి,
నీతోడఁజేసిన నెయ్యమింతయును
[1]నీ తెఱంగుననయ్యె నీటివ్రాక్పగిదిఁ !
గావున, మాతండ్రికరుణించినట్టి
జీవమంత్రము నీకుఁ జెడిపోవుఁగాక. "
అనుచుశపించిన నాకచుండలిగి,
యెనయ నాసతిఁజూచి: “యింతి, నేనిట్లు
ధర్మవాక్యము నిన్ను దాఁక నాడినను
ధర్మమే శపియింపఁ దరుణుకి నీకుఁ !
బ్రాణమంత్రము నాకుఁబనిసేయకున్నఁ,
ద్రాణ నాశిష్యులు [2]తా మొనర్చెదరు.
ఎనయంగ నీకును హితుఁడైన మగఁడు
మనుజేశుఁడగుఁగాక మహిమీఁద.” ననుచుఁ
గ్రమ్మఱశపియించి కచుఁడు షోవుటయు,
నమ్మానినియు నుండె నాత్మవగచుచును.
అంత, నావృషపర్వునాత్మజయైన
కాంతశర్మిష్ఠ భార్గవపుత్రిఁగూడి
పరిచారికలు పెద్దపరిచర్యసేయ
నరుదెంచి, వనములో నలరఁగ్రీడించి,
చీరలుధరఁబెట్టి శీతాంబు కేళి
వారకగావించి వారిలో వెడలి
శుక్రుకూఁతురుచీరఁజుట్టెఁ ; జుట్టుటయు
నక్రమంబున, దేవయాని యిట్లనియె:

  1. నీ తెఱంగుననీటనెఱివ్రాయుపగిది.
  2. తామెనేర్చెదరు. (మూ)