పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/181

ఈ పుట ఆమోదించబడ్డది

ఆదిపర్వము; ద్వితీయాశ్వాసము

117


అనిశాపమిచ్చిన నతఁడునట్లగుచుఁ
దనయులకిట్లనుఁ దా: 'సుతులార,
మీజవ్వనంబిచ్చి మీలోననొకఁడు
నాజరగొనుఁ' . డన్న నలుగురుసుతులు
'నోపము పొ ' మ్మన్న, నొనరఁ బూరుండు
చేపట్టిజర, తనచిన్నిప్రాయంబు
జనకునకిచ్చిన, జననాథుఁడలరి
తనపంపుసేయని తనయుల విడిచి,
తనరాజ్యమునఁ బూరుఁ దగివొప్ప నిలిపి
ఘనతపోమహిమ నాకంబున కేఁగె."
అనవిని జనమేజయావనీనాథుఁ
డనఘవైశంపాయనార్యు కిట్లనియె :
"వినుతాత్మ, మావంశవృద్ధులందఱును
ఘనధర్మపరులని కలయ నెన్నుదురు.
రాజయ్యుఁ దా నెట్లు రమణ యయాతి,
యోజ శుక్రునికూఁతు నుద్వాహమయ్యె
నీసందియము నాకు నెఱుఁగంగఁజెప్పు;
మేసమ్మతులఁ జూడ నిది యధర్మంబు."
అనిన నానృపుఁజూచి యమ్మౌని పలికె :
"విను మేర్పరింతు నావృత్తాంతమెల్ల ;
మును వృషపర్వుండు ముదమొప్ప దనుజ
ఘన రాజ్యమంతయుఁ గడిమి నేలుచును,
నొనరిన దానవయోధులఁ గూడి
తనర స్వర్గముమీఁద దండెత్తిపోయి,
యమరులుఁ దానును నతిఘోరరణము
నమితంబుగాఁజేసి యపజయంబొదవి,
యే తెంచి, తమపురోహితునకు నపుడు
[1]బ్రాఁతితో బ్రణమిల్లి భక్తినిట్లనియె:

  1. భ్రాంతితో. (మూ)