పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/180

ఈ పుట ఆమోదించబడ్డది

116

ద్విపద భారతము.


మొగి ధర్మసుతునితమ్ములు తరంగములు;
తగఁ జెలియలికట్ట ధర్మజుతాల్మి
కలహనహాయులు కలిసిననదులు;
తలకొన్న శకునిజూదము, దానివిషము ;
అరయ మధ్యస్థుఁడై వినోదించు
నారాయణుం డాదినారాయుణుండు.
సకలభూతోద్భవము సరవితోవిన్న ,
సకలసంపదలిచ్చు సర్వేశ్వరుండు.
ఇట్టివంశమున ననేకులు నృపులు
పుట్టి, యీయిలయేలి పోయిన వెనుక ,

యయాతి చరిత్ర

నహుషాత్మజుండైన నవకీర్తి శాలి
యహిమాంశునిభుఁడు యయాతిభూవిభుఁడు
సకలరాజ్యంబును సవరగా నేలి,
ప్రకటించి క్రతువులు బహుభంగిఁజేసి,
యతఁడు శుక్రునికూఁతు నసురేశుకూఁతు
మితి దేవయాని శర్మిష్ఠలన్వారిఁ
బరఁగవరించి, యాభార్గవియందు
వరుసతో యదునిఁ దుర్వసువునిఁ గాంచె.
సహ్యధర్మాత్ముఁ డాశర్మిష్ఠయందు
ద్రుహ్వ్యానుపూరుల దొరయంగఁబడసె.
అంత, శర్మిష్ఠపై నవనీశుకూర్మి
కొంతకాలముకు శుక్రునికూఁతురెఱిఁగి,
కోపించి జనకుతోఁ గుందిచెప్పుటయుఁ,
దాపసుండాకవి తద్దరోషించి:
'నాకూఁతు నవ [1]మాననము చేసెఁగానఁ,
జేకూరు వీనికి శిధిలంపుముదిమి.'

  1. అవమాన్యత. (మూ)