పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/178

ఈ పుట ఆమోదించబడ్డది

114

ద్విపద భారతము.


ఉరుశక్తి ద్వాపరయుగము నంశమున
ధరఁ బుట్టె శకుని జూదపునేర్పుతోడ ;
[1]ఘనుఁడు హంసుండను గంధర్వునంశ
మున ధృతరాష్ట్రుండు పుట్టె భూవిభుఁడు ;
విను మంత [2]మతియనువేల్పునంశమున
జనియించె గాంధారి శతపుత్త్రమాత ;
కలియుగాంశంబునఁ గడుఁగ్రూరుఁడగుచుఁ
దులితార్కుఁ డుదయించె దుర్యోధనుండు ;
తనరఁ బౌలస్త్యసోదరులు నూర్వురును
ననుజులై యుదయించి రాకౌరవునకు;
శిశుపాలుఁ డుదయించెఁ జెలఁగి హిరణ్య-
కశిపునంశంబునఁ గడుఁగ్రూరుఁడగుచు ;
అనువొప్ప సహ్లాదుఁడను దైత్యునంశ
మున శల్యుఁడుదయించె భుజబలోన్నతుఁడు ;
తగవొప్ప బాష్కలదైత్యునంశమున
భగదత్తుఁ డుదయించెఁ బరమవైష్ణవుఁడు ;
విప్రచిత్తను యక్షవిభుని యంశమున
సప్రతాపుఁడు జరాసంధుండుపుట్టె;
ననఘ! నపుంసకుండగు[3] గుహ్యునంశ
మునఁదోచె మలకంటి (?) మొండిశిఖండి ,
మానుగాఁ బుట్టిరి [4]మరుదంశమునను
శై నేయ విరట పాంచాలురన్‌ నృపులు ;
సదయాత్ముఁడైనట్టి జమునియంశమున
విదురుండు జనియించె విష్ణుభక్తుండు ;
అదె బ్రహ్మయంశంబునందుఁ బాండుండు
నుదయించె నెంతయు నుర్విమోదింప ;

  1. ఘనుడై ననఘుడై గంధర్వయంశ.
  2. మయయను.
  3. దైత్యునంశ.
  4. మనుదేశమునను. (మూ)