పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/172

ఈ పుట ఆమోదించబడ్డది

108

ద్విపద భారతము.


రతి సల్పవచ్చునె! రాత్రిగా; దీవు
[1]యతిపతి; వదిగాక, యేను గన్యకను;
ఈవు మున్నలిగిన నెసగు దావాగ్ని;
గావున, నేమి పల్కఁగ నేమి యగునొ!"
అనుటయు, మునిచంద్రుఁ డంధకారంబు
కెనయైనమూడ [2]మం చట గల్గఁజేసి,
కాంతియుఁ గన్నెఱికముఁ జెడకుండఁ
గాంతకు వర మిచ్చి, కక్కూర్తితోడ
వరద నొయ్యన వచ్చి, వడి నొక్కచోట
నొరగిన యాయోడ [3]నొడ్డునఁ జేర్చి,
'రమ్మ'ని కామినీరత్నంబు డించి,
సమ్మదంబున దర్భశయ్య గావించి,
యువిద మన్మథకేళి నోలలాడింప,
ధ్రువకీర్తి యపుడు సద్యోగర్భమునను
నుత్తుంగభుజములు, యోగదండంబు,
జొత్తిల్లుజడలును, సోగకన్నులును,
నీలాభ్రరుచులును, నెఱిఁగృష్ణమృగము
తోలుపుట్టంబు, వర్తులకమండలము,
లీలముక్తాక్షమాలిక, జన్నిదంబు,
వేలఁబవిత్రంబు వెసఁ దోడ మొలవ,
బ్రహ్మాంశమునఁ దాఁ దపస్వియై పుట్టె
బ్రహ్మణ్యుం డావ్యాసభట్టారకుండు.
ద్వీపంబునందు సంధిల్లుటఁ జేసి
ద్వైపాయనాఖ్యగాఁ దండ్రి గావింప,
ధర నిట్లు జనియించి తల్లిదండ్రులకు
గరములు మొగిచి : "యోకరుణాఢ్యులార,

  1. యెతిరితి
  2. మచ్చట
  3. వొయ్యన