పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/167

ఈ పుట ఆమోదించబడ్డది

ఆదిపర్వము-ద్వితీయాశ్వాసము

103


జయ్యన దొప్పలో సవరించి, యంత
నయ్యెడ సకలభాషార్థజ్ఞుఁడగుట
నొకడేగ రప్పించి యుర్వీశుఁ డనియెఁ :
"బ్రకటితపురుషార్థపరుఁడ వోపక్షి,
విష్ణువాహనవంశ[1]విదితుఁడ వీవు;
విష్ణుభక్తుఁడ నేను ; వినుమొకమాట.
చిత్తజుజలము నించితి మేను మఱచి;
యెత్తెఱం గొనరింతు: నిది యమోఘంబు!
కట్టెద నీమేడఁ; గడువేగఁ బోయి,
నెట్టన నీవయ్య నీచెలియలికి.
ఘనతఁ బక్షంబులు గలిగినవాని
తనయకు నీదుబాంధవ మెందుఁ గలదు!”
అనుచు దగ్గఱఁబోయి యావీర్యపాత్ర
యనఘుండు మెడఁగట్ట, నది మీఁది కెగసి
పోవఁబోవఁగ, మాంసబుద్ధి నచ్చటికి
నావల నొకపక్షి యడ్డంబు వచ్చి
యాలంబు సేయ, వీర్యంబు దొలంకి
కాళిందినడునీటఁ గాఱెఁ; గాఱుటయు,
నది మ్రింగి గర్భమై యందొకమీను
చదురైనవిధియాజ్ఞఁ జరియింపుచున్న,

మత్స్యగంధి జననవృత్తాంతము

నంబుధిలోన జాలంబులు వన్ని
పంబినయామీనుఁ బల్లెవాఁడొకఁడు
వేఁటలాడుచుఁ బట్టి వేతెచ్చి యింట
వాటంపుఁగూరకు వాలంగఁ దఱుగ,

  1. విదుడవునీవు (మూ )