పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/164

ఈ పుట ఆమోదించబడ్డది

ద్విపద భారతము


నాకలోకంబున నాగలోకమునఁ
జేకొని చదువఁబంచితిని శిష్యులను;
ఈలోకమున నాకు నెఱిఁగింపవలయుఁ
ద్రైలోక్యమున నది తనరునట్లుగను.”
అనిన, వేదవ్యాసుఁ డతనిప్రార్థనకు
ననుకూలచిత్తుఁడై యందఱఁజూచి,
వారివారికి వేడ్క వర్తిల్లుటెఱిఁగి,
యారాజవరున కిట్లని యానతిచ్చె:
"ఆనిన బ్రహ్మహత్యాది[1]పాపముల
కేను బ్రాయశ్చిత్త మిది చేసినాఁడ.
వినియెడువేడ్క దా వినుమ యెవ్వరికి
జనియించు నాతండు జగతి నానాఁడు.
నీనిమిత్తంబున నిఖిలమానవులు
నానుకయున్న భవాంబుధి గడచి
శ్రీనిధిపదభక్తి చెందఁగలారు;
మానవనా, ధనుమానంబు లేదు.
కావున, నీపుణ్యకథ కడముట్ట
సావధానమున వైశంపాయనుండు
చతురుండు సకలశాస్త్రార్థకోవిదుఁడు
హితమతి నన్నియు నెఱిఁగించు నీకు."
నని వానిఁ జూపి సంయమి పోవుటయును,
జనలోకపతి వేడ్కసంధిల్లనున్న,
వదలక యతని కావ్యాసజనంబు
మొదలుగా నక్కథ ముని చెప్పదొడఁగె:

ఉపరిచరవసువృత్తాంతము

“వసువనియెడురాజు వనధిపర్యంత
వసుధయేలుచు, నూఱువర్షముల్ తొల్లి

  1. పాతకుల (మూ)