పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/154

ఈ పుట ఆమోదించబడ్డది

92

ద్విపద భారతము.


జాబాలి జమదగ్ని జహ్ను శాండిల్య
కౌబిల మాండవ్య కణ్వ వశిష్ఠ
కపిల భరద్వాజు కశ్యపుల్ మొదలు
తపసుల నుత్తమోత్తముల రప్పించి,
పుణ్యాహవాచకపూర్వంబు గాఁగఁ
బుణ్యాంగనలుఁ గూడి పుణ్యుల గూడి,
దురితవిదూరబంధురకురుక్షేత్ర
విరచితశాలాప్రవేశంబు చేసి,
యాతంత్రమున బ్రహ్మ [1]యధ్వర్యుఁ డనఁగ
హోత యుపద్రష్ట యుద్గాత యనఁగ
వలయుఠావుల విప్రవరుల వరించి,
కులకాంత [2]క్రేవలఁ గూడి వర్తింప,
ఫలసూపములు, నెయ్యి, పాయసాన్నములుఁ,
గలపులు, శాకముల్, కపురవీడెములుఁ,
గార్పాస[3]రాజిత కనకవస్త్రములుఁ,
గర్పూరకస్తూరికాకుంకుమలును,
గుశ కూర్చ సమిధలుఁ, గుసుమాక్షతలును,
వశు పాత్ర పూర్ణకుంభములాదిగాఁగ
యాగోపకరణంబులన్నియుఁ గూర్చి,
భోగిభీకరమంత్రముల వ్రేల్చు నప్పు
డందంద యాగాగ్నియం దంతమగుచు
దందశూకావలి తమదుచొ ప్పెడలి
తొరఁగె దీర్ఘములైన తోఁకలతోడఁ,
దరణి కన్నెఱుఁగని తనువులతోడ,
గుఱుతైన క్రొవ్వాఁడి కోఱలతోడ,
నెఱినిప్పు లురలెడు నేత్రాలతోడ,

  1. అద్వశ్యులనఁగ.
  2. కోకిల
  3. కాయత (మూ)