పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/136

ఈ పుట ఆమోదించబడ్డది

74

ద్విపద భారతము


చొచ్చి లోనికిఁబోవ సుడిసి కార్చిచ్చు
నచ్చున నేర్చిన, నట వాని విప్రుఁ
డని మది నెఱిఁగి విహంగపుంగవుఁడు
వినయవాక్యంబుల విప్రుతోఁ బలికె :
అనఘచరిత్ర, బ్రాహ్మణుఁడ, వెల్వడుము
నిను మ్రింగ'; ననిన భూనిర్జరుం డనియె:
“ద్విజకులోత్తమ, యేను ద్విజకులోత్తముఁడ;
సుజనమాన్యుండఁ; బ్రసూనాస్త్రుబారిఁ
బాఱి, నిషాది నాపత్నిగాఁ జేసి,
వీరిలోపలఁ గూడి విహరింతు; నన్ను
నీ వెఱింగితి; ధర్మనియతి నీకంటె
భావించి కాంచు నేర్పరు లెందుఁ గలరు!
నాకూర్మిసతి కంఠనాళంబు చొచ్చి
నీకుక్షిలోపల నిలిచియున్నదియు ;
ఆకాంత రాక నేనవల రాఁదగదు;
నీకృప కలిమి మన్నించి నాకిమ్ము
విహగేంద్ర!" యనవుడు, విప్రుని మ్రింగ
విహితంబు గాదని వెలయ నిషాది
మగుడింపరామియు మదిలోనఁ దలఁచి,
తగిలి భూసురునిప్రార్థనమును జూచి :
అనఘాత్మ, యోధరామరవర్య, వేగ
చనుదెండు వెలువడి సతియును నీవు.'
అనవుడుఁ బ్రియమంది, యవనీసురేంద్రుఁ
డనురాగ ముప్పొంగ నపుడు నిషాది
సహితుఁడై వెలువడి సద్వృత్తినరిగె .
విహగాధిపతి బోయవీడెల్ల మ్రింగి,
పోయి సురాచలంబున నిష్ఠతోడఁ

బాయక కశ్యపబ్రహ్మకు నెఱఁగి :