పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/132

ఈ పుట ఆమోదించబడ్డది

70

ద్విపద భారతము


కులిశసన్నిభపటుక్రూరతుండాగ్ర
దళితనిష్ఠురధరాధరుఁడనై వీరిఁ
జేపట్టి, [1]కుచ్చితుచెలువున నేను
నీపాఁపకొదమల నిట్లు మోచుటకు
బనియేమి! చెప్పు మేర్పడ నాకు," ననిన,
వినత యగ్గరుడని వీక్షించి పలికె :
" ఖగనాథ, వినుమయా! కద్రువ నన్ను
బగగొని కపటంపుఁబన్నిదంబునను
గెలిచి యోడింప నీ క్రియ దాసినైతిఁ;
దలకొని నాకు నీదాసీత్వ ముడిపి
గైకొని రక్షింపు; గలరె నీకంటె
నాకు దిక్కొరులు పన్నగవైరి!" యనిన,
మనమున మిగులనుమ్మలికంబుఁ బొంది :
"జనని, నీవింక విచారింపవలదు;
ఇప్పని చింతింప నెంతటిభార!
మిప్పుడేఁ దీర్చెద; నిదె చూడు!" మనుచు
నలవు మీఱఁగ మారుతాశనజననిఁ
బలికె బ్రియోక్తితో బక్షినాయకుఁడు
దలపోసి: “నీవు మాదాసీత్వ ముడుప
వలయు; మీమదిలోని వాంఛితం బేమి!
కోరుఁ ; డట్టిది మీకుఁ గొనివచ్చి యిత్తు
వారిధినున్న దేవతలచేనున్న'
ననవుడుఁ బ్రియమంది, యహిరాజజనని
వినతాతనూజు భావించి, దీవించి,
యావైనతేయు కిట్లనియె: "నోగరుడ,
వేవేగఁ బోయి తే వెస నమృతంబు.

  1. కుచ్చంబు (మూ)