పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/130

ఈ పుట ఆమోదించబడ్డది

68

ద్విపద భారతము


అని ప్రభుత్వంబుగా నాడువాక్యములు
విని, యొండునాక యవ్వినతానుమతిని
జరమభాగమున నాసర్ప[1]శాబముల
నిరవుగా నిడికొని యేఁగి, శైలములు
వనములుఁ బురములు వరుస దీవులును
వనధులు దిశలు భూవలయంబు నదులు
నొండొండ చూపుచునుండఁగా, బాఁప
తండంబు వేగ నుద్ధతకోపు లగుచు
వినతకొడుకని కాద్రవేయులు గరుడుఁ
బనులు పంపుచు, వీపుపై నెక్కికొనుచు,
నొకనాడు దమకు సూర్యునిఁ జూపుమనఁగ,
వికటభోగులఁ బక్షి వీపునఁ దాల్చి
సప్తమారుతజవసత్వుఁడై యెగసి
సప్తాశ్వమండలస్పర్శుఁ డౌటయును,
బన్నగావలి చండభానువేఁడిమికి
నన్నియుఁ బెటపెటమని ప్రేలి ముణిఁగి
ధరమీఁదఁ బడి మూర్ఛదగిలియుండుటయు,
గరుడనిఁ గోపించి కద్రువ వగచి :
“యుసురుచాలనిపుత్రు లొకవేవురేల !
యసమశౌర్యుఁడు చాలఁడా యొక్కఁ!” డనుచు
వినతాత్మజునిలావు వినుతించి, యంత
దనయులదెసకు నెంతయుఁ జిన్నవోయి,
యొసగిన యినరశ్మి నందఱుఁ గమరి
వసుధపై ద్రెళ్లిన వారలఁ జూచి,
యింద్రుఁనిఁ బ్రార్థించి హితసుధావృష్టి
సాంద్రతఁ గురియించి సమసినవారి

  1. బక్షములు (మూ)