పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/128

ఈ పుట ఆమోదించబడ్డది

66

ద్విపద భారతము


ననితలవాంచి, తా నాకద్రువకును
గొనకొని నీతితోఁ గోరినపనులు
కాలూఁదనెడలేక గైకొని మిగులఁ
దాలిమిఁజేయుచోఁ, [1] దరలెను బంచ
శతవత్సరములు. వేసటలేకయుండ,
మతిలోనఁ గౌతుకోన్మాదియై, యపుడు
పన్నగకులమాత పక్షీంద్రుమాత
నెన్నక పనిగొని యేలుచునుండె”.
అని యిట్లు జనమేజయక్షితీశునకు
ముని చెప్పె నని చెప్ప మోదించి మునులు :
“అనఘాత్మ, తరువాత నైనవృత్తాంత
మనువొందఁ జెప్పవే!' యనివేఁడుటయును,
సౌమిత్రినిక్షేప, సమరాంతచాప, (?)
రామ, గయాక్షేత్రరచనావిధిజ్ఞ,
శూద్రతపోవిఘ్న, సురకార్య[2]మగ్న,
యద్రీంద్రరచితమహాసేతుబంధ,
దశకంఠనాభిసుధాగ్రాహివిశిఖ,
దశరథశాసనోత్సవదత్తచిత్త,
ఇది సదాశివభక్త హితగుణాసక్త
సదయస్వరూప కాశ్యపగోత్రదీప
శ్రుతిపాత్రవల్లభ సూరిసత్పుత్త్ర
మతి మద్విధేయ తిమ్మయనామధేయ
రచితాదిపర్వనిర్మలకథయందు

సుచితమై యాశ్వాస మొక్కటి యొప్పె

——♦♦♦♦ ♦♦♦♦——

  1. దరలక
  2. నిఘ్న (మూ)