పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/118

ఈ పుట ఆమోదించబడ్డది

56

ద్విపద భారతము


యకలంక శోభనాయతిఁ దొంటియట్లు
సకలసౌభాగ్యవిస్తారమై వెలయు
నమరావతీపురి నభిషిక్తుఁ డగుచుఁ,
గమనీయభోగసౌఖ్యంబులచేత
నలఘుసంతషుఁడై యఖిలదిక్పతులఁ
బొలుపార నిజపురంబులకు వీడ్కొలిపి,
పౌలోమియును దాను భాసిల్లఁ గూడి
లీలతో దివము పాలింపుచునుండె.

కద్రూవినత లుచ్చైశ్శ్రవముఁ జూచుట


ఆరీతిఁ గలశాబ్ధియం దుద్భవించి
భూరివిఖ్యాతితో బొలుపొందునట్టి
వాసవతురగంబు వనరాశిపొంత
భాసురగతిఁ జరింపఁగ, నొక్కనాఁడు
వినత కద్రువయు సద్వినుతచారిత్ర
మున యథేచ్ఛవిహారమునఁ జరియింపఁ
దలఁచి, వేడుకమదిఁ దరుణు లయ్యెడను
వెలయంగ సఖులు సేవింప, నుత్ఫుల్ల
కుసుమపరాగసంకులలసద్భ్రమర
[1]కిసలయాహారకోకిలశుకధ్వనుల
వలనొప్పుచున్న యవ్వనిఁ గేళి వేడ్క
సలుపుచు, నొండొండ జలజలోచనలు
చతురత దీపింపఁ జయ్యన నరిగి,
క్షితి[2] నతిచేలంబు, జితకిల్బిషంబు,
గ్రావాశ్రయంబు, గీర్వాణాశ్రయంబు,
శ్రీవరు శయనసుస్థితినివాసంబు,

  1. విసరకాసారకోకిల
  2. పతిచెల్వంబు (మూ)