పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/112

ఈ పుట ఆమోదించబడ్డది

ద్విపద భారతము


పయ్యెద వెడఁజారి పాలిండ్లు దోప,
నొయ్యారికచభార మొయ్యొయ్యఁ గదలఁ,
జరణనూపురములు ఝణఝణ మ్రోయ,
గరిమతో రత్నమేఖలమాల పొలయఁ,
దను జూచి దివిజులు దనుజులు మతుల
నెనసిన భ్రమఁ జేష్ట [1]లేది యీక్షింప,
నల్లనల్లన దానవావలిఁ జేరి
పల్లవాధర మృదుభాష నిట్లనియె:
"వీర దానవులార, వినుఁడు మీలోన
నీరీతి నపనమ్మి కేటికి [2]విడుఁడు;
తడయక, యీయమృతంబు నాచేత
నిడుఁడు; నేఁ బంచెద నెలమి నేర్పొదవ.
నేను వడ్డించిన నెవరు మాటాడఁ
గా నోరులాడునె! కడఁకతో మీకు
నడ్డుమీఱఁగ, మాఱు వేడకయుండ,
వడ్డింతుఁ; గరలాఘవంబు గన్గొనుఁడు;
తెం." డన్న, నప్పుడు దేవతారాతి
మండలి యమ్మాయమగువమాటలకు :
............................................
[3]జననిరొ, జవదాటజాలము నేము;
వనిత, నీ వేరీతి వడ్డించితేని
మనముల నదియెల్ల మాకు సమ్మతము
కొ "మ్మని యమృతంపుఁగుండ నిచ్చుటయుఁ,
గొమ్మ సంప్రీతిఁ గైకొని చేతఁబూని :
"బంతిసాగుఁడు దేవపతులు దానవులు;
వరుసతోఁ దరువాత వచ్చి వడ్డింతు".

  1. వేది
  2. వినుఁడు
  3. జవరొని (మూ)