పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/111

ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము

49


అచ్చరల్, సురధేను, నైరావతంబు,
నుచ్చైశ్రవంబు, దివ్యోర్వీజములును,
జింతామణియు సురశేఖరు కొసగె,
[1]నంతఁ ద్రిమూర్తులు నబ్ధినిఁబొగడ,
నయ్యెడఁ బ్రమథు లొయ్యనరాఁగ, హరుఁడు
చయ్యన విష్ణుకంజాతసంభవుల
వీడ్కొని, సురలెల్ల వినుతించి మ్రొక్క
వేడ్కతో నేఁగె నవ్వెండికొండకును.

అమృతోత్పత్తి



వెండియుఁ దరువ, నవ్విషధిమధ్యమున
నుండి ధన్వంతరి యురుకాంతిశాలి
ఘనతరంబగుసుధాకలశంబు చేతఁ
గొని రాఁగఁ, జూచి రక్షోనాథు లెల్లఁ :
"గలిగిన వస్తుసంఘములెల్లఁ దారె
బలువిడిబాఱరె పాళ్లు గైకొనియు!
నిదియైన మనము గ్రహింత;” మటంచుఁ
గుదిసి తత్ కలశంబు గొని రింపుతోడ.
అప్పుడు వెఱఁగు నత్యంతదైన్యంబు
గప్పి, నిశ్చేష్ట మొగంబులు వాంచి
యున్న దివ్యుల హరి 'యోడకుం' డనుచుఁ,
గ్రన్నన మాయాప్రకారసంవేది
యొక్కకృత్రిమరూప మొనరు వధూటిఁ
దక్కకకల్పింపఁ [2]దలఁచి, తాఁ గాంతిఁ
[3]బొలుచు మోహనరూపమును, విభ్రమంబుఁ
దళుకొత్తఁ [4]జక్క గాంతారూపు దాల్చి,


 

  1. అంత ద్రిమూర్తులు నబ్ధులు సురలు
    నయ్యెడఁ బ్రమథు లెయ్యెడ హరుండు,
  2. తనరు తత్కాంతి
  3. గలిగి
  4. చక్రి (మూ)