పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/106

ఈ పుట ఆమోదించబడ్డది

44

ద్విపద భారతము


అప్పుడు గనుఁగొని యార్తసంరక్షు
డప్పురుషోత్తముఁ డమరదైత్యులకు
సతిజవసత్వంబు లగ్గలంబొసగ,

హాలాహలోత్పత్తి



ధృతిమీఱి యప్పుడు దేవసంఘంబు
లాదానవులకంటె నధికసత్వంబు
తో ద్రచ్చుటయు, వారిదోర్బలాటోప
భీకరమథనసంభృతదీప్యమాన
లోకభయంకరాలోలవిశాల
తరవిస్ఫులింగోగ్రదర్పిత[1]జ్వాల
లురుతరంబుగ మండి యుడువీథి నిండి
యొక్కట జగము లాహుతిఁ గొనఁజాలు
నక్కాలకూటమహాగరళంబు
బలువిడి ప్రభవించి పఱతేరఁ జూచి,
నలుఁగడ దేవదానవులెల్ల బ్రమసి
పాఱంగ, నప్పు డాపన్నగశాయి
వారలతో నొక్కవాక్యమిట్లనియె:
"వెఱవకుఁ, డిప్పు డీవిషవహ్నిభయము
కఱకంఠుచేఁగాని కడతేఱిపోదు;
చని, యమ్మహాదేవు శరణంబు వేడుఁ,
డనిన , బ్రహ్మయును దేవాసురావలియుఁ
గడువేగ రజతనగంబునకేఁగ,
[2].................................................
.................................................
గజకర్ణ శార్దూలకర్ణాశ్వకర్ణ
విజయ ఘంటాకర్ణ విమలగోకర్ణు

  1. జ్ఞాను (మూ)
  2. గ్రంథపాతమైయుండును.