పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/102

ఈ పుట ఆమోదించబడ్డది

40

ద్విపద భారతము


నంచితలీల దుగ్ధాంభోధికడకు
వేంచేయఁగాఁ, గాంచి వెస నబ్ధిరాజు
తడయక యాచక్రధరునకు నొసగ
వడి నర్ఘ్యపాద్యముల్ వరుసతోఁ గొనుచు
నెదురేగి పూజింప, నెలమి నాహరియు
ముదముతోఁ గొని యాసముద్రు మన్నించె.

బృహస్పతి రాయబారము



అయ్యవసరమున, నట బృహస్పతియుఁ
జయ్యననేఁగి యుజ్జ్వలనీతిశాలి
బలి కాలకేయోగ్ర బాష్పల భీమ
[1]నల విప్రజిత్ శకంధర తీవ్ర నముచి
పనస బిడాల శంబర శతమాయు
లనువారు మొదలైనయసురనాయకులఁ
బొడగాంచుటయును, నప్పుడు వారలెల్ల
నుడుగనిభక్తిఁ బ్రత్యుత్థితులగుచు :
"ననఘచరిత్ర, నీయరుదెంచినట్టి
పనియేమి? దయ మాకుఁ బస నానతీవె!"
నావుడు, నాదైత్యనాథులతోడ
నావిబుధాచార్యుఁ డనియె నేర్పెసగ :
"అమరవల్లభుఁడు మీయందఱితోడ
సముచితముగఁ గూడి చరియింపఁదలఁచి,
పవిపాణి మీతోడఁ బలుకుమన్నట్టి
వివరంబు చెప్పెద; వినుఁడు మీరెల్ల:
'తాము మేమును నన్నదములమయ్యు
నీమాడ్కి నన్యోన్య మీసుగానేల!
[2]జగతి నేప్రొద్దొ గోచారాన మనకు

జగడంబు వచ్చినఁ జనునె పాయంగ!
  1. నలివిప్రజిత్తకందర
  2. జగతిపై ప్రొద్దు గోచరమున మనకు (మూ)