పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/95

ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము - ఆ -2

81


ఏమి చేయుదు, వీఁ డెన్ను చందమునఁ
గామినిఁ బంపినఁ గాని యూఱడఁడు!
ఒప్పునే సైరంధ్రి యురుపుణ్యసాధ్వి:
ము ప్పొంద నొడిగట్టె మూర్ఖుం డితండు.
గంధర్వు లేగురు గరితకుం బతులు ;
గంధద్విపోపమఘనపరాక్రములు ;
విడుతురే యూరక వీనిఁ జంపకయ?
కడుదాఁపుగా వచ్చేఁ గాలంబు వీని,
కెక్కడికీచకుఁ డింక నా" కనుచు
మ్రొక్కిన ముద్దుతమ్ముని లేవ నెత్తి
కాటుకకన్నీరు గండరేఖలకు
మాటుగా నేడ్చుచు మగువ యిట్లనియె:

ద్రౌపదిం దనయింటికిఁ బంపునట్లు కీచకుఁడు సుదేష్ణ నొడంబఱచుట.

"వెఱవకు, మింక నవ్వెలఁది యెవ్వారు
నెఱుఁగ కుండఁగ వచ్చు నేను పొమ్మనిన ;
పొమ్ము , నీ యింటికిఁ బొలఁతి మద్యంబుఁ
దెమ్మని పుత్తు నీదినములో " ననినఁ
దెలిసిన మొగముతోఁ దివిరి కీచకుఁడు
వెలయంగ నింటికి వేవేగఁ బోయి