పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/68

ఈ పుట ఆమోదించబడ్డది

ద్విపద భారతము


నా ముగ్ధ “నిందు ర " మ్మని చేరఁ బిలిచి ,
"ప్రేమ నెంతయుఁ జూచి ప్రియమునఁ బలికె  :
నీవంశ మెట్టిది, నీకుఁ బే రేమి ?
నీ వీవురంబులోనికి వచ్చు టేల ?
గరుడ కిన్నరయక్ష గంధర్వసతులు
నిరుపమస్థితిఁ బోల్ప నినుఁ బోల లేరు.
దీనవృత్తికి నోర్చు తెఱఁగు నీయందుఁ
గానము, నీ కేల కాంత యి ట్లుండ ?,
చెప్పుము నీ" వన్నఁ జిగురాకుబోణి
యొప్పైనమృదుభాష సువిద కిట్లనియె:
"జలజాక్షి సైరంధ్రి జాతిఁ బుట్టితిని;
వెలయ మాలిని యండ్రు వేడ్కతో నన్ను,
మగలు నా కేగురు; మఱి వారియెదుటఁ
బగవారు ముందలఁ బట్టి యీడ్చినను,
ఎగ్గుగా నెంచక యేను నామగలు
నెగ్గించి వ్రతుల మై యెల్లను విడిచి
యడవిలో నుండితి; మావ్రతంబునకు
గడమగా నొకయేడు గలదు మా కింక.
నీ యింట నీయేఁడు నెమ్మితో నుండి
పోయెద ననుబుద్ధి పుట్టి వచ్చితిని.