పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/63

ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము - ఆ -1

49


తగ వొప్ప నురిత్రాళ్లుఁ దగినదామెనలు
మొగిఁ గట్టి యొకత్రాట మోపుగాఁ జుట్టి,
కురువిందపూసలు గ్రుచ్చి హారములు
ధరియించి, తిరుమణిఁ దఱచుగాఁ బెట్టి,
నున్ననిసెలగోల నును పైనజడయుఁ
జెన్నారఁ, జెవిఁ గొన్ని చిగురుటాకులును
వెలయ, గోవుల గాచువెన్నుండుఁ బోలె ;
కొలువువారలచూడ్కిఁ గొల్ల వెట్టుచును
వెడ వెడ వెఱపుతో విరటుసన్నిధికి
నడతెంచి విభునికి నలు వొప్పఁ బలికె:
"వసుధేశ విను గొల్ల వాఁడ నీనగరఁ
బసుల గా చుటకు నై పని వింటి నేను.
అరయఁ దంత్రీపాలుఁ డను పేరు నాకు.
ధరణీశ మొదవులతర మెఱుంగుదును.
తొఱఁగి పోవక యుండ, దుష్టజంతువులు
తఱుమక యుండ, నిత్యముఁ బాడి గొనఁగ,
క్రేపులు వెలయ నంకిలి లేక యుండ,
నాపాటి గొల్ల లు నను మెచ్చి పొగడ
నుండెద న న్నేల నోపుదే” యన్నఁ
బాండవానుజుఁ జూచి పలికె నవ్విభుఁడు: