పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/49

ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము - ఆ -1

35


"అట్ల చేయుఁడు, పొందుఁ డఖిలభోగముల
నేట్లు కావలసిన, నే నున్న వాఁడ,
ఎవ్వఁడు మీకును నెగ్గు గావించుఁ
ద్రెవ్వి వేయుదు వానిఁ దివిరి న స్బంపు,
ఇది యేల ? మీకు మ మ్మేలి సామ్రాజ్య
పదవిఁ జేకొన రాదె పరిణమించెదను.
ఏలినఁ ద్రిజగంబు లేల నోపుదురు!
పోలింప మామత్స్య భూమి మీ కెంత ?"
అన విని దరహాస మాననాబ్జమునఁ
దనరార నతనితో ధర్మజుం డనియె:
వడి నేలఁ బడి యుండి వట్టిపంటలను
గుడిచి నెమ్మది నుండుకొలఁది మాకొలఁది.
భూము లేలఁగ నేల? భోగంబు లేల?
భూమీశ నీ వింత బోధింప వలదు."
అనవుడు భూపాలుఁ డటు సమ్మతించి
తనకు జూదముమీఁదితమకంబు చెప్పి
మీతోడిసద్గోష్ఠి మే లయ్యె ననుచుఁ
బ్రీతుఁ డై కౌంతేయుఁ బెద్ద మన్నించె.
అతఁ డిట్లు భూనాధు నర్థితో గొలిచి
యతిమాన్యుఁ డై యున్న యవసరంబునను,