పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/42

ఈ పుట ఆమోదించబడ్డది

28

ద్విపద భారతము


అరులపై మనభీముఁ డాగ్రహం బెత్తి
యరుదెంచుఁ బలుమాఱు నాయుధములకు,
ఇయ్యేటిలో మీర లితని కేమఱక
చయ్యన నొకమాయ సవరింపుఁ డయ్య."
అనుచు ధర్మ జుఁ డంత నామ్రను డిగ్గి
పొనరఁ బ్రదక్షిణం బులు చేసి మ్రొక్కి
భీముఁడీ పనికిఁ గోపించునో యనుచు
భీముని కొక్కింత ప్రియముగాఁ బలికి
యతనిఁ గౌగిటఁ జేర్చి యచ్చోటఁ గొంద
ఱితరులు వర్తింప నిచ్చలో బెదరి
తా రొండొరులుతోడ దగఁ బల్కురీతి
వారికి మఱుపెట్ట వలసి యిట్లనియె:
"మొదల నూఱేఁడులముసలి యై తల్లి
యిది యీడుదీఱిన నిట్లు చేసితిమి..
పూని పీనుఁగుఁ గాల్చి పోదురు కాని
మ్రాన గట్టెడువారు మహిలోనఁ గలరె ?
తడయక మనకుఁ బెద్దలు సేయుజాడఁ
గడఁగి చేయక పోదు కానఁ జేసితిమి."
అని యిట్లు పలుమాఱు నచటిగోపాల
జనములు విన నాడ సహదేవుఁ డంత