పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/364

ఈ పుట ఆమోదించబడ్డది

352

ద్విపద భారతము.

నొనరించి యొప్పుగా నొగి నందుమీఁదఁ
గనకపీఠము వెట్టి కణఁకతో మఱియు
వలయు కార్యంబుల వర్తించి రంత.
నెలఁదులఁ బిలిపించి విరటభూవిభుఁడు
ఘనలీల నుత్తరఁ గైసేయఁ బనిచె.
తనయులుఁ దమ్ములుఁ దానుఁ బత్ని యును
బహుకుంకుమాంబరాభరణమాల్యముల
విహితవేదజ్ఞు లౌవిప్రపుంగవులఁ
బిలిపించి పూజించి పేరటాండ్రకును
దిలకించుకట్నముల్ తెఱఁ గొప్ప నిచ్చి
మహితవైభవమున మఱియుఁ గొ ల్వుండి
మహితమోదము నొంది మది ధర్మ జునకు
ననుపమం బగులగ్న మాయత్త మయ్యె
నని చెప్పి పంపిన నతఁడు వేగమున
వనజనాభునియాజ్ఞ వల నొప్పఁ బడసి
యనుజన్ములుసు దాను నర్థి గై సేసి
శుభవేషయుతు లౌచుఁ జుట్టాలు గొల్వ
నభిమన్యుఁ బూజించి యక్కుమారకునిఁ
బట్టంపు టేనుఁగుపై నుండఁ బనిచి
నెట్టన శుభతూర్యనిచయంబు మ్రోయ