పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/363

ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము--ఆ-5

351

మాయాపురము మించె మఱపించెఁ గాంచి
నాయయోధ్యను బోలె సాలంక గెలిచె.
అప్పు డాయధికారు లనుపమగతుల
దప్పక నగరిలోఁ దగ వారఁ జొచ్చి
పచ్చపట్టెలభాతిఁ బవడాలు నిలిపి
పచ్చిదవనముతోఁ బందిళ్లు పెట్టి
కొలువుకూటంబుల గుంకుమం బలఁది
పొలు పారఁ గప్పురమ్రుగ్గులు పెట్టి
మాణిక్యదీపము ల్మణికవాటముల
రాణించి నిరుపమప్రభ గొల్పు చుండ
మె త్తని వెలి పట్టు మేల్కట్టు గట్టి
ముత్తెంబులును బుష్పములు వ్రేలఁ గట్టి
హయదంతిశాలలు నస్త్రశాలలును
నియతి శోధించి వెన్నెలనిగ్గు దొరయ
జతురత మఱి పెండ్లి చవికెయు నరుగు
నతివిచిత్రము గాఁగ నలవరించుటయుఁ
బవడంపుబోదలుఁ బసిడివాసములు
నవరత్నమయము లౌనాల్గుకంబములు
వెండిపట్టెలు వట్టివేఱుకప్పులను
ఒండొంటి మిగులంగ నొకవేది యందు