పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/359

ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము--ఆ-5

347

తమకు రాజులు కన్ను దనియఁ గానుకలు
క్రమ మొప్ప నిచ్చినఁ గడఁగి కై కొనుచు
వేడుక రెట్టింప విరటభూపాలుఁ
డూడిగంబులు సేయ నున్నతస్థితిని

రామకృష్ణులు సకలయాదవాన్వితులై యుపప్లావ్యంబుఁ జేరుట.


భాసిల్లునంతలో బలుఁడు నచ్యుతుఁడు
నాసాత్యకియును భద్రాభిమన్యులును
దనరఁ బ్రద్యుమ్నుండుఁ దగ యుధామన్యుఁ
డనఘుఁ డక్రూరుండు నంత సాంబుండు
కృతవర్మ తారుఁ గ్రిక్కిఱిసి యాదవులు
అతివీరదండసేనాధినాయకులు
మణిరథారూడు లై మత్తేభ తురగ
మణులతోఁ గామినీమణులతోఁ గదిసి
పసిఁడియందలములుఁ బసిఁడిగొల్లెనలు
పస నారురథములుఁ బట్టయినబండ్లు
తగరుటెక్కెంబులుఁ దమ్మటంబులును
జగజంపుగొడుగులుఁ జూమరంబులును
దమతోడనే తేరఁ దతవైభవంబు
లమరంగ నెంతయు నానంద మలరఁ