పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/358

ఈ పుట ఆమోదించబడ్డది

346

ద్విపదభారతము

టిది ధర్మ రాజున కెఱిఁగింత” మనిన
నదయుఁ డై కోపించి యాభీష్ముఁ డనియె:
"వినెడువారలు నవ్వ విభుఁడ వై యుండి
పనికి మాలినయట్టిపల్కు పల్కెదవు !
ఇది నీకు మఱచుట కేది కారణము ?
మది నొవ్వ నాడెదు మ మ్మింత" యనిన
నందఱు నామాట లగుఁ దప్ప వనిరి.
మందారదాముఁ డై మఱునాఁడు పతియుఁ
జావఁగా మిగిలినసైన్యంబుతోఁడ
వేవేగ నగర ప్రవేశంబు చేసి
క్రక్కున రేపాడి గగనభాగమునఁ
జుక్కలపస లేనిశుభ్రాంశుపగిదిఁ
బడి యాజిఁ గూలినవారి బంధువులు
విడువక వాపోవ వినుచు నే తెంచి
యమ్మకు నట మ్రొక్కి యాంబి కేయునకు
నిమ్ముల మ్రొక్కి తొల్లిటియట్టు లుండె.
అట జమ్మి కడ కేగి యల్ల పాండవులు
పటుతరాస్త్రంబులు భక్తి నర్చించి
కైకొని విరటభూకాంతుఁ దోడ్కొనుచుఁ
బ్రాకటగతి నుపప్లావ్యంబుఁ జొచ్చి