పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/351

ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము--ఆ-5

339

బనిపూని వారలు పసిఁడికొప్పెరలఁ
గొని తెచ్చి యుదకంబు కొమ్మకు వార్చి
తనువు మెత్తనిచీరఁ దడి యొత్తి సతికిఁ
బొనర హంసావళిపుట్టంబు గట్టి
నిడుద లై యొప్పారునిండు వెండ్రుకల
తడి యార్చి నవపుష్ప దామము ల్దుఱిమి.
పన్నీటఁ గుంకుమపద నిచ్చి కలిపి
నున్ననిమెయిపూఁత నుతలీలఁ బూసి
గోరోజనంబు చెక్కులఁ దీర్చి వ్రాసి
తోర మై నుదుటఁ గస్తురిబొట్టు వెట్టి
పలుకుల మెదిచినపచ్చకప్పురము
కలికికాటుకనీటఁ గనుదోయి దిద్ది
లత్తుకజిగి యారులలితపాదముల
హత్తించి కెమ్మోవి కది వన్నె వెట్టఁ
బసిఁడిమట్టియలును బసిఁడియందియలు
రశనాగుణంబులు రత్న ముద్రికలు
మణిహారనాసికామణికంఠ హార
మణికంకణంబులు మానుగాఁ బెట్టి
నీరజాక్షికి నప్డు నిలువుటద్దంబు
గారాముతోఁ జూపి కడుసంభ్రమమున