పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/35

ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము - ఆ -1


వెలయుపద్మములచే వినుతింపఁ బడిన
కొలఁకుల జలకేళిఁ గోర్కిఁ జేయుచును,
బహువర్ణమృగముల బహుపక్షితతుల
బహునదీనదములపంక్తిఁ జూచుచును,
జని చని మత్స్య దేశముఁ జేరఁ బోయి
తనరార నంతట ధౌమ్యు వీడ్కొలిపి
రతఁడుఁ బుణ్యాశ్రమోపాంతభూములకుఁ
జతురుఁ డై యేతెంచి సద్గోష్ఠి నుండె.
అటు పాండవులు పోవునపుడు పాంచాలి
పటుశోకవివశ యై పతుల కి ట్లనియె:
ఆసన్న మని వచ్చి యతిదూర మేను
గాసిల్లు టెఱుఁగరు కడవ నే గెదరు.
కొలఁకులు నదులును గోర్కిఁ జూపుచును
నిలిచెద మని యెందు నిలువ కేగెదరు.
మిడుకుమధ్యాహ్నము మెఱయఁ గాల్నడను
విడువక చనుదేర వెలఁదు లోపుదురె ?
కాళ్లసఖములందుఁ గ్రమ్మె రక్తములు;
వ్రేళ్లపుటంబుల విరిసె బొబ్బలును ;
పొందుగాఁ దఱచుటూర్పులు సందడించె;
ఇందుండి నొచ్చితి నేను రా లేను.”