పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/347

ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము--ఆ-5

335

యొదవె గెల్పు మహాత్ముఁ డొకఁ డుంట నంటిఁ
గదనంబు గెల్చినఘనుఁడు దా నితఁడు.
అరదంబు డిగ్గి యే నటు పాఱి పోవఁ
గురురాజు చూడఁగాఁ గూడ నే తెంచి
వెఱపు దీర్చినయట్టివీరవాక్యములు
మఱవంగ లేను, క్రమ్మఱఁ జెప్ప లేను.
తననామములు చెప్పి తనసహోదరులు
మనవీట నుండుట మఱి నాకుఁ జెప్పి
కదనంబులోఁ దేరు గదలింపు మనిన
సదిలోకవిపరీతమగుట నే నెఱుఁగ.
పోరిలో హయరత్నములఁ దోలి తోలి
వారక ధృతి దూలి వశము గా కున్నఁ
గుశలుఁ డై యితఁడు నాకును దోడు చేసె
వెస" నన్న నప్పుడు విరటభూవిభుఁడు

భయభక్తులు దోఁప విరటుఁడు పాండవుల గౌరవించుట.



వెఱపు సంతోషంబుఁ వినయంబుఁ బ్రియము
నెఱయఁ బార్థునిఁ దాను నెఱిఁ గౌఁగలించి
పాండవాగ్రజునకు భక్తిసాష్టాంగ
దండప్రణామంబు తగ నాచరించి